రెండోపెళ్లికి ప్రకాష్ రాజ్ రెడీ!
పదిహేనేళ్ల కాపురం తర్వాత తన భార్య లలితా కుమారితో గత నవంబర్ లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా రెండో పెళ్లికి సిద్ధపడుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల కథనం. బాలీవుడ్ లో ప్రముఖ కొరియాగ్రాఫర్ పోనీ వర్మను ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకోనున్నారట. గత రెండేళ్లుగా ఈ ఇద్దరి మధ్యా డేటింగ్ నడుస్తోందనీ, ఇప్పుడు ప్రకాష్ రాజ్ విడాకులు తీసుకోవడంతో వీరి పెళ్లికి మార్గం సుగమ మైందనీ ఆ వర్గాలు చెబుతున్నాయి.
'పోనీ, ప్రకాష్ రాజ్ లు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. అయితే అప్పట్లో ప్రకాష్ రాజ్ విడాకుల ప్రయత్నంలో ఉండటంతో తమ అనుబంధం గురించి ఎక్కువ ప్రచారం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పెళ్లి వార్తలను కూడా ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు విడాకుల వ్యవహారం పరిష్కారం కావడంతో ఇద్దరూ పెళ్లి ద్వారా ఒకటయ్యే విషయాన్ని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు' అని ఆ వర్గాలు తెలిపాయి.పోనీ ప్రస్తుతం తన కెరీర్ ను సీరియస్ గానే తీసుకుందనీ, ప్రియదర్శన్ చిత్రంతో పాటు, సంజయ్ లీలా బన్సాలీ 'గుజారిష్' చిత్రంలోని కొన్ని పాటలకు ఆమె కొరియోగ్రఫీ అందిస్తున్నారనీ, భవిష్యత్తు పట్ల ధీమాగా ఉందనీ వారంటున్నారు. 'వాంటెడ్' చిత్రం ద్వారా ప్రకాష్ రాజ్ కు హిందీలోనూ మంచి పేరు రావడంతో ఆయనను పెళ్లి చేసుకుని ఇద్దరి కెరీర్ నూ సమానంగా ప్లాన్ చేసుకునేందుకు ఇదే మంచి తరుణంగా పోనీ భావిస్తున్నారట. ప్రకాష్ రాజ్ సైతం దక్షిణాది భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకూ సమ ప్రాధాన్యం ఇస్తూ కెరీర్ ను మలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రకాష్-పోనీల పెళ్లి ఈ ఏడాది మధ్యలో జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.
Be first to comment on this News / Article!
|