నయనతో ప్రభుదేవా డ్యూయెట్
ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లయినా అమ్మానాన్నల ఇష్టంతోనే జరుగుతుందని రెండ్రోజుల క్రితం ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అందాల నటి నయనతార ఇప్పుడు మరోసారి ప్రభుదేవాతో కలిసి కనిపించబోతోంది. అయితే ఇది పబ్లిక్ వ్యవహారమే కానీ, ప్రైవేట్ వ్యవహారం కాకపోవడం విశేషం. శింభుతో ప్రేమాయణం బెడిసికొట్టిన తర్వాత నయనతార ప్రభుదేవాతో చనువుగా ఉండటం ఇటీవల పలు వదంతులకు దారితీసింది. ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చిన నయనతారను పెళ్లాడబోతున్నారనీ, కొద్దికాలంగా ఆ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారనీ, ఇవన్నీ కాదు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారనీ గట్టి దుమారమే రేగింది. ప్రభుదేవా భార్య సైతం ఓ ఇంటర్వ్యూలో నయనతార కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తానని చెప్పడం కూడా ఈ వదంతులకు బలం చేకూర్చింది. ముంబైలో జరిగిన హిందీ 'వాంటెడ్' ('పోకిరి' రీమేక్) ప్రీమియర్ షోలో ప్రభుదేవాతో కలిసి నయనతార పాల్గొనమే ఆమె ఆగ్రహానికి కారణం. కొద్దిరోజులుగా ఈ వ్యవహారం సద్దుమణిగింది. తాజాగా మరోసారి ప్రభుదేవా, నయనతార జంటగా ఓ డయాస్ మీద కనిపించబోతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి బర్త్ డే సందర్భంగా ఈనెల 6వ తేదీన తమిళ చిత్ర పరిశ్రమ ఆయనను ఘనంగా సన్మానించనుంది. సినీ పరిశ్రమను నమ్ముకున్న వారంతా ఇళ్లు కట్టుకునేందుకు వీలుగా 115 ఎకరాల భూమిని ఇటీవల కరుణానిధి వారికి కేటాయించారు. కరుణానిధి చూపిన ఔదార్యానికి కృతజ్ఞతగా కోలీవుడ్ పరిశ్రమ ఆయనను పుట్టినరోజు సందర్భంగా ఘనంగా సన్మానించనుంది. ఈ వేడుకలో భాగంగా పలువురు స్టార్లు, డాన్సర్లు ఓ ఎంటర్ టైన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ప్రభుదేవా-నయనతార జంట కలిసి ఓ పాటకు డాన్స్ చేయబోతుండటం ఈ కార్యక్రమంలో ఓ హైలైట్ కానుందట. ప్రస్తుతానికి మాత్రం ఈ ఇద్దరి డాన్స్ ఐటెం విషయాన్ని సీక్రెట్ గానే ఉంచుతున్నారు.
Be first to comment on this News / Article!
|