'కామ్రేడ్'గా....
పుట్టినరోజున కొత్త సినిమా ప్రారంభం కావడం నాకు కొత్త కాదు. ఈ ఏడాది కూడా 'కామ్రేడ్ ' చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమవుతోంది. కామ్రేడ్ అంటే అందరూ అనుకున్నట్టు కాకుండా 'క్లోజ్ ఫ్రెండ్' అని అర్ధం. దీనికి పరుచూరి సోదరులు రచన చేశారు. డి.ఎస్.రావు నిర్మాతగా అనిల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నా గత చిత్రానికీ ఈ చిత్రానికీ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిన మాట నిజమే. సరైన సబ్జెక్ట్ దొరక్కపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు 'కామ్రేడ్' కథ నచ్చి చేస్తున్నాను.
రాజశేఖర్ రెడ్డి లైన్ లో...
మహానేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోయే 'రాజశేఖర్ రెడ్డి' సినిమా తప్పనిసరిగా ఉంటుంది. నేనూ, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎక్కడకు వెళ్లినా జనం ఇదే విషయం అడుగుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ 'గోలిమార్' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తి కాగానే 'రాజశేఖర్ రెడ్డి' సినిమా ఉంటుంది...అంటూ రాజశేఖర్ నవ్వుతూ చెప్పారు.