శివరాత్రి కానుకగా 'తేజం'
కొత్త నటీనటులతో సన్ రేస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఎ.బలరాం సమర్పణలో రాజ్.కె.యస్.గోపి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'తేజం'. సర్దార్ పటేల్, సురేష్, మహేష్, రాజ్, వివేక్, వినోద్, గౌతమ్, జయవర్ధనం, రామకృష్ణ, సత్య, ప్రవీణ్, మోనిష, ఆర్.చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న శివరాత్రి కానుకగా విడుదలవుతోంది. హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
సమర్పకుడు బలరాం మాట్లాడుతూ, యువతరం మెచ్చే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి తెరకెక్కించారనీ, అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధంగా ఉందనీ చెప్పారు. యువతను ఆకట్టుకునే అన్ని అంశాలతో పాటు బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ కామిడీ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని దర్శకుడు గోపి పేర్కొన్నారు. సర్దార్ పటేల్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చిందనీ, నవరసాలూ ఇందులో ఉన్నాయనీ చెప్పారు. చిత్ర ఛాయాగ్రాహకుడు నాగేంద్రకుమార్ మాట్లాడుతూ, ఇందులో దాదాపు అందరూ కొత్తవాళ్లే నటించినప్పటికీ చాలా బాగా చేశారనీ, దర్శకుడు గోపీ తొలిచిత్రానికి పనిచేస్తున్నట్టు కాకుండా ఎంతో అనుభవమున్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు సమావేశంలో పాల్గొన్న వినోద్, మౌనిక, నాగేంద్రకుమార్ అభిలషించారు.
Be first to comment on this News / Article!
|