బిందాస్..డబ్బులు వాపస్!
మా సినిమా మీకు నచ్చకపోతే టిక్కెట్ డబ్బులు వాపసు ఇస్తామని చెప్పే గట్స్ ఏ నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్ కూ ఉండదు. అయితే తొలిసారి ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఇందుకు శ్రీకారం చుట్టుంది. 'మా సినిమా చూసి మీకు నచ్చకపోతే డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు' అంటోంది. మంచు మనోజ్ కథానాయకుడుగా ఈనెల 5న 'బిందాస్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాల రచయిత వీరుపోట్ల తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనోజ్ సినీ కెరీర్ లోనే తొలిసారి 10 ప్రింట్లతో ఈ చిత్రాన్ని అమెరికాలో ఎ.కె.ఎంటర్ టైన్స్ మెంట్స్ స్యయంగా విడుదల చేస్తోంది. ఇందులో భాంగానే యుఎస్ ప్రేక్షకులకు ఈ 'ఫుల్ టిక్కెట్ రిఫండ్' ఆఫర్ ఇచ్చింది.
'బిందాస్' టిక్కెట్లను ఆన్ లైన్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సినిమా ఏమాత్రం నచ్చకపోయినా ఆన్ లైన్ పర్జేజ్ రిసిప్ట్ ను అడ్రస్ తో కూడిన కవరులో తగిన పోస్టేజ్ స్టాంపులు అంటించి AK Entertainments, 415 W.Golf Rd; # 55; Arlington Heights, IL 60005కు పంపించాల్సి ఉంటుంది. నిర్మాతల గట్స్ కు తగ్గట్టే 'బిందాస్' హిట్టయితే మనోజ్ కూ సరైన బ్రేక్ దొరికినట్టే.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|