ట్రయాంగిల్ ఫైట్...
సంక్రాంతికి విడుదలైన 'అదుర్స్', 'నమో వెంకటేశ', 'శంభో శివ శంభో' చిత్రాలు వరుసగా ఇదే ఆర్టర్ లో ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయి. కలర్ లో వచ్చిన క్లాసిక్ 'మాయాబజార్' సైతం తొలివారం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రేక్షక జనం ఆమోదముద్ర వేయించుకుంది. దీంతో పలువురు నిర్మాతలు రెట్టించిన ఉత్సాహంతో తమ కొత్త చిత్రాల రిలీజ్ లు ప్రకటిస్తూ థియేటర్ల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ శుక్రవారం మూడు కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ సినీగోయెర్స్ తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. సిద్దార్ధ కథానాయకుడుగా నటించిన 'స్టైకర్', మంచు మనోజ్ 'బిందాస్', సెల్వరాఘవన్ (శ్రీరాఘవ) డైరెక్ట్ చేసిన 'యుగానికి ఒక్కడు' ఈ పోటీలో ఉన్నాయి. ఈ మూడింటిలో 'బిందాస్' ఒక్కటే స్ట్రయిట్ తెలుగు చిత్రం కాగా, మిగిలిన రెండూ స్ట్రయిట్ చిత్రాలనిపించే ప్రత్యేక ఆకర్షణలున్న అనువాదాలు.
సిద్దార్ధ హిందీలో నటించిన 'స్ట్రైకర్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలవుతుండటం, సిద్దార్ధకు తెలుగు హీరోగా తగిన పాపులారిటీ ఉండటంతో సహజంగానే ఈ చిత్రంపై కొన్ని అంచనాలు ఉన్నాయి. సూర్య తమ్ముడు కార్తి కథానాయకుడుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'యుగానికి ఒక్కడు' చిత్రం ఇప్పటికే తమిళంలో 'ఆయిరత్తిల్ ఒరువన్' పేరుతో విడుదలైంది. సినిమా ఎత్తుగడ, ముగింపు అక్కడి ప్రేక్షకులను గజిబిజి చేసినట్టు సమీక్షలు చెబుతున్నాయి. దీంతో ఆ చిత్రాన్ని దాదాపు 45 నిమిషాల పాటు ట్రిమ్ చేసి ఇప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక 'బిందాస్' విషయానికి వస్తే...ఫైట్స్ అన్నీ మాస్...కామెడీ అంతా క్లాస్..సినిమా మొత్తం బిందాస్ అంటూ ప్రీ-పబ్లిసిటీతో ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మనోజ్ కెరీర్ లో తొలిసారి 10 ప్రింట్లతో యుఎస్ లో కూడా ఈ చిత్రం మంచి అంచనాలతో విడుదలవుతోంది. మొత్తానికి ఈ శుక్రవారం విడుదలవుతున్న మూడు చిత్రాల్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూడాలి.
Be first to comment on this News / Article!
|