పూరీ...ఏమాయ చేస్తాడో?!
కొత్త హీరోలను పరిచయం చేయడంలో తన సత్తా చాటుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇప్పుడు యువహీరో నాగచైతన్య చిత్రం కోసం ముఖానికి మేకప్ కూడా వేసుకోబోతున్నారు. ఇప్పటికే 'ఠాగూర్', 'అదుర్స్' చిత్రాల్లో దర్శకుడు వి.వి.వినాయక్ కనిపించడం, సెంటిమెంట్ గా ఆ రెండు సినిమాలు హిట్ కావడం బహుశా పూరీకి కూడా స్ఫూర్తినిచ్చి ఉండొచ్చు. నాగచైతన్య కథానాయకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తుది మెరుగుల్లో ఉన్న 'ఏమాయ చేసావె' చిత్రంలో పూరీ తన నిజ జీవిత పాత్రనే పోషించబోతున్నట్టు సమాచారం. అంటే దర్శకుడుగానే ఆయన స్క్రీన్ పై కనిపించబోతున్నారు.
'జోష్' చిత్రం తర్వాత నాగచైతన్య నటిస్తున్న 'ఏమాయ చేసావె' చిత్రాన్ని ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నారు. దర్శకుడిగా ఓ చిన్న పాత్రను పూరీ పోషించనున్నారు. సమంత అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఆస్కార్, గ్రామీ అవార్డుల విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన ఆడియో ఈ బుధవారంనాడే సోనీ మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి విడుదలైంది. ఫిబ్రవరి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Be first to comment on this News / Article!
|