ఇంటర్నెట్ లో ఎక్కువ డౌన్ లోడ్ లు ఏ తారామణులవో వారికి నెంబర్ వన్ ర్యాంకింగ్ లు ఇస్తున్న సందర్భాలు ఇటీవల చాలానే చూసాం. తమ అందచందాలతో వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న హీరోయిన్ల పట్ల నెట్ ప్రియులకు ఉన్న మోజు అలాంటిది. దీనిని ఆసరాగా చేసుకుని ఆయా తారల పేర్లతో వైరస్ ను క్రియేట్ చేసి కక్కూర్తి పడ్డ నెటిజన్ల పిసిలు, ల్యాప్ టాప్ లకు దాన్ని 'కానుక'గా ఇస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఆ మధ్య 'ఖుష్బూ' పేరుతో ఓ వైరస్ ఇలానే దాడి చేసింది. కొద్దిరోజుల క్రితమే 'నమిత' న్యూడ్ వీడియో అంటూ ఓ వైరస్ నెటిజన్లను బెంబేలెత్తించింది. ఇప్పుడు 'లక్స్ పాప' పేరుతో ఓ ఇ-మెయిల్ స్వైరవివాహం చేస్తోంది. దీనికి 'లక్స్ పాప సెక్స్ వీడియో' అనే అటాచ్ మెంట్ కూడా ఉంటోంది.
'లక్స్ పాప'గా పాపులర్ అయిన ఆశాషైనీ గురించి అందరికీ తెలిసిందే. ఇదేదో ఆశాషైనీ నుంచి వచ్చిన బంపర్ ఆఫర్ అనుకుని ఎవరైనా డౌన్ లోడ్ కు వెళితే ఇక అంతే సంగతులు. ఒక బలమైన వైరస్ దాడి చేస్తుంది. హార్డ్ డిస్క్ 'క్రాష్' అయి ఇక పిసి రిపేర్ చేయడం బ్రహ్మతరం కూడా కాదు. నేరుగా తీసుకు వెళ్లి దాన్ని కుప్పతొట్టిలో పడేయాల్సిందే. సో...'లక్స్ పాప' బారిన పడకుండా తస్మాత జాగ్రత..జాగ్రత.