జైపూర్ లో ఎన్టీఆర్ 'శక్తి'
సంక్రాంతికి 'అదుర్స్'తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో 'శక్తి' చిత్రం షూటింగ్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ తో 'కంత్రి' చిత్రాన్ని అందించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో 'శక్తి' తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం ఈ నెల 6 నుంచి రాజస్థాన్ లోని జైపూర్ లో కీలకమైన షెడ్యూల్ ను జరుపుకోనుంది.
జైపూర్ లో 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్ జరుగుతుందనీ, 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఒక పాట, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, దత్ గారి బ్యానర్ లో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు జోడిగా ఇలియానా నటిస్తున్న ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, సిరివెన్నెల-రామజోగయ్య శాస్త్రి పాటలు, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|