19న వస్తున్న 'సాధ్యం'
జగపతిబాబు, ప్రియమణి జంటగా ముచ్చటగా మూడోసారి కలిసి నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సాధ్యం'. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో కుమార్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 19న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరికొత్త స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం రూపొందిందనీ, జగపతిబాబు పాత్రతో పాటు ప్రియణి పాత్ర చాలా హైలైట్ గా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. చిన్నచరణ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు మంచి స్పందన వస్తోందనీ, ఈనెల 19న సినిమా విడుదల చేస్తామనీ తెలిపారు. కథ-కథనాలే ఈ చిత్రానికి బలమని దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ తెలిపారు. గాయం, అంత:పురం చిత్రాలకు మించిన పవర్ ఫుల్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తారనీ, ప్రియమణి ఇంతవరకూ చేయని పాత్రను ఇందులో పోషించారనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట, తనికెళ్ల భరణి, యుబి రాజు, సత్యప్రకాష్ తదితరులు నటించారు. శ్యామ్ మనోహర్ కథ-స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి శ్యామ్-మడూరి మధు మాటలు, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|