శ్రీకాంత్ హీరోగా 'సేవకుడు'
'మహాత్మ' చిత్రంతో 100 చిత్రాలు పూర్తి చేసిన శ్రీకాంత్ కథానాయకుడుగా శ్రీ మహా గణపతి ఫిలిమ్స్ పతాకంపై 'సైనికుడు' అనే ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. కెమెరామన్ గా, నిర్మాతగా మంచి పేరున్న ఎం.సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వి.సముద్ర దర్శకుడు.
చిత్ర విశేషాలను నిర్మాత సుధాకర్ తెలియజేస్తూ, కెమెరామన్ గా పలు చిత్రాలకు పనిచేసిన తాను గతంలో శ్రీకాంత్ హీరోగా 'తారకరాముడు','మనసిస్తారా' చిత్రాలను నిర్మించారనీ, మళ్లీ ఇప్పుడు ఓ మంచి కథతో 'సేవకుడు' చిత్రాన్ని శ్రీకాంత్ తో చేస్తున్నాననీ చెప్పారు. మార్చి 5న షూటింగ్ ముహూర్తం చేసి జూన్ వరకూ జరిగే నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. శ్రీకాంత్ ఇంతవరకూ చేయనటువంటి ఛాలెంజింగ్ పాత్ర ఇందులో పోషిస్తున్నట్టు తెలిపారు. శ్రీకాంత్ కు జోడిగా విమలారామన్ నటించనున్న ఈ చిత్రంలో నాజర్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఎం.సుధాకర్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ దేవా సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|