బికినీ తెచ్చిన అదృష్టం
మిస్ ఇండియా ఆస్ట్రేలియా-2004 విమలారామన్ ఆలస్యంగానైనా ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది. విమలారామన్ సిడ్నీలోనే పుట్టి పెరిగినప్పటికీ మలయాళ 'టైమ్' చిత్రంలో నటనకు శ్రీకారం చుట్టుంది. ఆ తర్వాత బాలచందర్ 'పోయ్' చిత్రంతో తమిళంలో తన అదృష్టం పరీక్షించుకుంది. ఆ చిత్రం 'అబద్ధం' పేరుతో తెలుగులో విడుదలైంది. యువహీరో ఉదయ్ కిరణ్ కు జోడిగా విమలారామన్ నటించిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఫెయిల్ అయింది. దీంతో ఒకింత నిరాశపడిన విమలారామన్ మరో యువహీరో వరుణ్ సందేశ్ తో 'ఎవరైనా ఎపుడైనా' చిత్రంలో జతకట్టింది. ఆ చిత్రం కూడా ఫ్లాపే. యువహీరోల కంటే విమల ఒకింత పెద్దగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిచండంతో వాటికి 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రంతో ఆమె ఇప్పుడు ధీటైన సమాధానం ఇవ్వబోతోంది. ఇందులో తరుణ్ కు జోడిగా ఆమె నటిస్తోంది. ఒక పాటలో ఆమె హాట్ హాట్ గా కనిపించడంతో పాటు, స్విమ్ షూట్ ధరించి ఆలవోకగా తన అందాలను ప్రదర్శిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ చూసిన పలువురు హీరోలు తమ చిత్రాల్లో విమలారామన్ ను సిఫార్సు చేస్తుండటం మరో రెండు కొత్త ఆఫర్లు విమల చేతిలో పడ్డాయి.
జగపతిబాబు కథానాయకుడుగా ప్రవీణ్ శ్రీ దర్శకత్వంలో డాక్టర్ ధర్మకర్త సి నిర్మిస్తున్న 'గాయం-2', శతచిత్రాల నటుడు శ్రీకాంత్ కథానాయకుడుగా వి.సముద్ర దర్శకత్వంలో రూపొందనున్న 'సేవకుడు' చిత్రాల్లో విమలారామన్ హీరోయిన్ గా ఎంపికైంది. మొత్తానికి బికినీ మంత్రం ద్వారా 'చుక్కలాంటి అమ్మాయి...' రిలీజ్ కాకుండానే చక్కనైన ఆఫర్లు దక్కించుకున్న విమల అదే ఊపులో తొలి సక్సెస్ ను కూడా దక్కించుకుంటుందేమో చూడాలి.
Be first to comment on this News / Article!
|