నమో వెంకటేశ ట్రిపుల్ ప్లాటినం
వెంకటేష్, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన 'నమో వెంకటేశ' చిత్రం రాష్ట్రమంతటా దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై సంచలన అమ్మకాలు జరుపుకొంది. ఈ సందర్భంగా ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో జరిపారు. వెంకటేష్, శ్రీనువైట్ల, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథా రచయిత గోపీ-మోహన్, కెమెరామన్ ప్రసాద్ మూరెళ్ల, గేయరచయిత రామజోగయ్య శాస్త్రి, నటులు కాశీ విశ్వనాథ్, సురేష్, జి.వి., వెంకీ, భ్రమరాంబ థియేటర్ మేనేజర్ వాసు, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ, చంటి నుంచి గణేష్, లక్ష్మి, తులసి...ఇప్పుడు నమె..వెంకటేశ వరకూ వరుసగా తన చిత్రాలను ఆదిరించి హిట్ చేస్తున్న అభిమానులూ, ప్రేక్షకులకు తన కృతజ్ఞతలని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు థాంక్స్ అనీ, శ్రీనువైట్ల టీమ్ అంతా కలిసి చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారనీ పేర్కొన్నారు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ నవ్వూత ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటాలని కోరుకుంటున్నాననీ, ఇలాగే మునుముందు కూడా తన చిత్రాలను అంతా ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ, తనకు ఇష్టమైన హీరో వెంకటేష్ తో పనిచేయాలనే కోరిక ఈ చిత్రంలో నెరవేరిందనీ, ప్రేక్షకులు ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆనందంగా అందనీ అన్నారు. ఆడియో పెద్ద హిట్ అయిందనీ, సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి ఈ ఫంక్షనే నిదర్శనమనీ అనీల్ సుంకర్ అన్నారు. మళ్లీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో ఆడియెన్స్ ను కలుసుకుంటామన్నారు. సినిమాను ఇంతపెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలనీ, మళ్లీ వెంకటేష్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో మరో హిట్ సినిమా తీయాలని ఆశిస్తున్నామనీ మరో నిర్మాత రామ్ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|