నమో వెంకటేశ ట్రిపుల్ ప్లాటినం
నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, శ్రీనువైట్ల మైండ్ గేమ్, వెంకటేష్ బాడీలాంగ్వేజ్ కలగలిపిన ఈ చిత్రం 175 రోజులు ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆంధ్రదేశమంతటా...నమో వెంకటేశ పేరు చాలా ఫేమస్ అనీ, అదే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం పెద్ద హిట్టయిందనీ అన్నారు. శ్రీనువైట్ల కామెడీని అద్భుతంగా చిత్రీకరించారనీ, సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారనీ ప్రసాద్ మూరెళ్ల అన్నారు. 'నమో వెంకటేశ' ఆడియో, సినిమా పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ కు కృతజ్ఞతలని దయానంద్ పేర్కొన్నారు. అనంతరం వెంకటేష్ ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ప్లాటినం డిస్క్ లు అందజేశారు. యూనిట్ అంతా కలిసి వెంకటేష్ కు డిస్క్ అందించారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|