ఈ నెలలోనే ఛార్మి 'సయ్యాట'
ఛార్మింగ్ అందాల ఛార్మిని సరికొత్తగా చూపిస్తూ 'సై ఆట' చిత్రం తెరకెక్కుతోందని చిత్ర నిర్మాతలు నల్లూరి సుధారణి, రాజశేఖర్ తెలిపారు. ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె.ఆర్.కె.పవన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఒక పాట చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కమర్షియల్ అంశాలు, అత్యున్నత సాంకేతిక విలువలు జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. కథకు ఎంత ప్రాధాన్యం ఉందో, పాటలకూ అంతే ప్రాధాన్యం ఉందనీ, దేవీశ్రీప్రసాద్ వీనులవిందైన సంగీతాన్ని అందించారనీ తెలిపారు. త్వరలోనే ఆడియో, నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇది తన కెరీర్ లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందని ఛార్మి తెలిపింది. 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' చిత్రాలను మించి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా తన పాత్రను దర్శకుడు మలిచిన తీరు కొత్తగా ఉందనీ, ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మాతలు తీశారనీ తెలిపింది. ఈచిత్రంలో ఛార్మి క్యారెక్టరైజేషన్, కథ-కథనం, సంగీతం, ఫోటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణలని దర్శకుడు పవన్ తెలిపారు. ఈకాలం అమ్మాయిలకు ఛార్మి పాత్ర ఓ రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. భారీ నిర్మాణ విలువలతో తీసిన చిత్రమిదని చిత్ర నిర్మాణ నిర్వాహకుడు దేశినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, రావు రమేష్, డాక్టర్ శివప్రసాద్, అజయ్, ఆలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, రమాప్రభ, మాస్టర్ భరత్, సుమన్ శెట్టి తదితరులు నటించారు. భాషశ్రీ మాటలు-పాటలు, జె.ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|