వేసవిలో 'నువ్వెక్కడుంటే...'
అందమైన ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం 'నువ్వెక్కడుంటే...నేనక్కడుంటా'. ఉదయ్ కిరణ్, శ్వేతబసు జంటగా నటిస్తున్నారు. యు.కె.అవెన్యూస్ ఉదయ్ కిరణ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతవరకూ 60 శాతం షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ శనివారంనాడు తెలిపింది.
హృదయానికి హత్తుకునే సన్నివేశాలతో చక్కటి ప్రేమకథతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోందని సమర్పకుడు ఉదయ్ కిరణ్ తెలిపారు. హీరో ఉదయ్ కిరణ్ కు ఈ చిచ్రం చక్కటి బ్రేక్ ఇస్తుందని అన్నారు. పాండిచ్చేరి, చెన్నైలో తాజాగా ఓ షెడ్యూల్ పూర్తి చేశామనీ, ఈ షెడ్యూల్ లో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ చెప్పారు. ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాల సమాహారమే ఈ చిత్రమని నిర్మాణ సారథి సోమా విజయప్రకాష్ తెలిపారు. త్వరలో హైద్రాబాద్ లో మరో షెడ్యూల్ మొదలుపెట్టి సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ షెడ్యూల్ లో హాస్యనటులపై సన్నివేశాలు, రెండు పాటలు, పతాక సన్నివేశాలు తీస్తామని చెప్పారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, నిళల్ గల్ రవి, చిత్రం శ్రీను, నళిని, రాజ్యలక్ష్మి గుండు హనుమంతరావు, ఆర్తి తదితరులు నటిస్తున్నారు. జనార్దన మహర్షి-నివాస్ మాటలు, రాఘువ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|