'లీడర్' 19కి వాయిదా
శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం మరోసారి వాయిదా పడింది. ఈనెల 11న ఈ చిత్రం విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఇప్పుడు మరో వారం తర్వాతే సినిమా రిలీజ్ చేయబోతున్నారు. ఆ ప్రకారం 19న 'లీడర్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
డాక్టర్ డి.రామనాయుడి మనవడు, సురేష్ బాబు తనయుడు అయినా రానాకు హీరోగా ఇది మొదటి చిత్రం. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై ఎం.శరవణన్, ఎం.ఎస్.గుహన్, అరుణ గుహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ కమ్ముల చిత్రాల్లోనే 17 కోట్ల అత్యధిక బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతలకు బిజినెస్ పరంగా టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ హక్కులను (వైజాగ్, సీడెడ్ మినహా) ఠాగూర్ మధు సొంతం చేసుకుని విడుదల చేయబోతున్నారు. ఇటీవలే 'అవతార్' తెలుగు అనువాద హక్కులతో ఠాగూర్ మధు సక్సెస్ ను చవిచూశారు. అదే గట్స్ తో 'లీడర్' చిత్రాన్ని ఆయన గట్టి పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి తోడు నాగార్జున 'కేడీ' ఈనెల 12న విడుదలవుతున్నందున ఆ సినిమాతో క్లాష్ రాకుండా కూడా వారం రోజుల వాయిదా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పటికే ఒకటి రెండు వాయిదాలు తీసుకున్న 'లీడర్'...లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందని ప్రేక్షకులతో అనిపించుకుంటుందా అనేది తెలియాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే.
Be first to comment on this News / Article!
|