రామ్ చరణ్ తో ధోని
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, 'మగధీర'తో సంచలనాలు సృష్టించిన రామ్ చరణ్ తేజ ఇప్పుడు కలిసి నటించబోతున్నారు. అయితే వెండితెరపై కాకుండా పెప్సీ కమర్షియల్ లో ఈ ఇద్దరూ కలిసి కనిపించబోతుండటం విశేషం. థమ్సప్ కు మహేష్, సెవన్ అప్ కు అల్లు అర్జున్ ప్రచారం నిర్వహిస్తుండగా రామ్ చరణ్ పెప్సీకి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ అయిన ధోనీతో కలిసి ఈసారి రామ్ చరణ్ పెప్సీ యాడ్ లో దర్శనమివ్వబోతున్నారు. దీనికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాడ్ కాన్సెప్ట్ కూడా త్రివిక్రమ్ అందిస్తూ ఇందుకోసం భారీ మొత్తాన్ని పారితోషికంగా అందుకోనున్నారు.
పెప్సీ కొత్త యాడ్ చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. దీనిని ఐ.పి.ఎల్. సందర్భంగా టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు. రామ్ చరణ్ గత పెప్సీ కమర్షియల్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకునేతో కలిసి నటించారు.
Be first to comment on this News / Article!
|