మూడోవారంలో 'జాయ్'
అవితేజ్, త్రినాథ్ హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇవివి కంభన్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జాయ్'. బి.రాజా దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల మూడో వారంలో విడుదల కానుంది.
స్నేహం, ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రమిదనీ, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు రాజా తెలిపారు. ముఖ్యంగా సునీల్ క్యారెక్టర్ చాలా హైలైట్ గా ఉంటుందనీ, హీరోహీరోయిన్లు కొత్త వారైనప్పటికీ చక్కగా నటించారనీ అన్నారు. ఇటీవల విడుదలైన ఆడియో సాధించిన విజయం సినిమాపై మరింత అంచనాలు పెంచిందన్నారు. చక్కటి కాన్సెప్ట్ తో అందర్నీ అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఇవివి కంభన్ తెలిపారు. దర్శకుడు రాజా కొత్తవాడైనప్పటికీ ప్రతి సీన్ అద్భుతంగా తీశారనీ, సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయనీ తెలిపారు. ఈనెల మూడో వారంలో ప్రేక్షకులను జాయ్ చిత్రం బాగా ఎంజాయ్ చేస్తుందని అన్నారు. యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయనీ, దర్శకుడు చెప్పిన కథని చెప్పినట్టుగా తెరకెక్కించారనీ హీరో అవితేజ్ పేర్కొన్నారు. నిర్మాత కంభన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారనీ, విద్యాసాగర్ మ్యూజిక్ పెద్ద హిట్ కావడంతో సినిమా కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకం తనకుందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో వెన్నెరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ తదితరులు నటిచారు. భువనచంద్ర పాటలు, స్వర్ణ సుధాకర్ మాటలు, ఆకాష్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|