'బిందాస్'కు అదనపు ప్రింట్లు
హీరో మంచు మనోజ్ కుమార్ కు ఈ ఏడాది 'బిందాస్' చిత్రం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. మనోజ్, షీనా జంటగా ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వీరుపోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన 'బిందాస్' గత శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ప్రేక్షకుల స్పందన చూసిన నిర్మాత మూడో రోజు నుంచే 65 అదనపు ప్రింట్లు విడుదల చేశారు.
'బిందాస్' చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుండటం తమకెంతో సంతోషాన్నించిందనీ, విడుదలైన మూడో రోజే అన్ని ఏరియాల నుంచి వస్తున్న డిమాండ్ ను బట్టి ప్రింట్లు పెంచామనీ చెప్పారు. మనోజ్ కెరీర్ లో 100కు పైగా ప్రింట్లతో ఈ చిత్రం విడుదలైందనీ, ఇప్పుడు మరిన్ని అదనపు ప్రింట్లు పెంచడం ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ చిత్రాన్ని చేరువ చేస్తున్నామనీ తెలిపారు. మనోజ్ కామెడీ, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం పట్ల దర్శకుడు వీరుపోట్ల సంతోషం వ్యక్తం చేయగా, 'బిందాస్'ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనే గాకుండా అమెరికాలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుండటంతో లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోనూ ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|