3 భాషల్లో 'విధాత'
రంగనాథ్, ప్రసన్నకుమార్, లిరీష, రూపారెడ్డి ప్రధాన పాత్రల్లో 'విధాత' అనే మెగా డైలీ సీరియల్ రూపుదిద్దుకుంటోంది. ఎబ్ కో సమర్పణలో దువ్వూరి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి డి.ముంజల నిర్మాతగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది రూపొందుతోంది. సురేష్ కలగ దర్శకుడు.
ఈనెల 9న శ్రీశైలంలో షూటింగ్ ప్రారంభించి పది రోజుల పాటు జరుపుతామనీ, ప్రతినెలా పదిరోజుల పాటు హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు. సోషల్, పొలిటికల్, కరప్షన్, ఫ్యామిలీ అఫైర్స్ , మైథలాజికల్ రీబర్త్, చేతబడి, ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలో ప్రతి మనిషికి అవసరమయ్యే ముఖ్యాంశాలను టచ్ చేస్తూ ఈ సీరియల్ ను రూపొందిస్తున్నామనీ, స్త్రీ గొప్పతనాన్ని, సమాజంలో ఆమె పడే ఇబ్బందుల వల్ల సొసైటీ ఏవిధంగా దిగజారుతోందనే అంశాలను కీలకంగా చర్చిస్తామని అన్నారు. సీనియర్ నటుడు రంగనాథ్ మాట్లాడుతూ, మన నాగరికత అన్ని దేశాలకంటే ప్రాచీనమైనదనీ, కళలు-సంస్కృతి విశిష్టమైనవనీ, అలాంటి పాయింట్ తో వస్తున్న ఈ సీరియల్ లో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాననీ తెలిపారు. ఈ సీరియల్ అందరినీ ఆలోచింపజేస్తూ, దర్శకనిర్మాతలకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందన్నారు. నటుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఇందులో తాను ప్రధానపాత్ర పోషిస్తున్నాననీ, ఇప్పుడున్న పరిస్థితులు, దేశ రాజకీయాలు, రాజకీయలోపాలను ఎత్తిచూపుతూ ప్రతి ఎపిసోడ్ అత్కంఠ భరితంగా సాగుతుందన్నారు. చిత్రయూనిట్ తో పాటు దర్శకనిర్మాతలకు ఈ సీరియల్ అవార్డుల పంట పండిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెగా సీరియల్ లో గోపాలకృష్ణ ఆకెళ్ల, ఎఫ్.ఎమ్.బాబాయ్, కోటేశ్వరరావు, శ్రీలక్ష్మి, శోభ, త్రిష, కల్పన చౌదరి తదితరులు నటిస్తున్నారు. డి.రవికుమార్ కథ, ఎస్.ఎస్.మురళీ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|