'రాంబాబుగాడి పెళ్లాం' 26న
అల్లరి నరేష్ కథానాయకుడుగా ఫ్యామిలీ, సెంటిమెంట్, రొమాంటిక్ ఆంశాలను మేళవించి రూపొందించిన చిత్రం 'రాంబాబు గాడి పెళ్లాం'. దీనికి 'వాడికి ఆ ఫీలింగ్ లేదు' అనే ట్యాగ్ లైన్ ఉంది. గజాలా, సోనాలి జోషి నాయికలుగా నటించారు. సితార అర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఎం.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాపుగండి రాజేంద్ర దర్శకుడు. ఈ చిత్రం డిటిఎస్ మిక్సింగ్ జరుపుకొంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇది చక్కటి కుటుంబ కథా చిత్రమిదనీ, అందరినీ అలరించే విధంగా ఉంటుందనీ చెప్పారు. ఈనెల 16న ఆడియో, 26న సినిమా విడుదల చేస్తున్నట్టు చెప్పారు. నరేష్ తో పాటు, గజాలా, సోనాలి జోషి చక్కటి నటన ప్రదర్శించారని దర్శకుడు రాజేంద్ర తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గీతాసింగ్, ఆలీ, ఎల్బీ శ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్, కౌసల్య, జ్యోతి, ప్రదీప్ నటించారు. రామ్ పినిశెట్టి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, కమలాకర్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|