యువహీరో రామ్ తదుపరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. రామ్ తో 'రెడీ' వంటి సన్సేషన్ హిట్ ను అందించిన స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'టామ్ అండ్ జెర్రీ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
'కిక్' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి మరో చిత్రానికి కమిట్ అయ్యారు. మహేష్ బాబు కథానాయకుడుగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఏడాది ద్వితీయార్థంలోనే సెట్స్ పైకి రాబోతోందని సమాచారం. ఈ నేపథ్యంలో స్రవంతి రవికిషోర్ చిత్రానికి సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పక్కా స్క్రిప్టు కూడా రెడీ చేశారు. 'దేవదాసు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మళ్లీ రామ్ కు జోడిగా ఈ చిత్రంలో ఇలియానా నటించనుంది. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. మార్చిలో ఈ చిత్రం ప్రారంభం కానుంది తెలుస్తోంది. రామ్ ప్రస్తుతం వాసు ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రచారార్భాటాలకు దూరంగా షూటింగ్ జరుపుకొంటూ తుదిమెరుగుల దశలో ఉంది.