ఫైనల్స్ లో 'యంగ్ ఇండియా'
డాక్టర్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'యంగ్ ఇండియా' చిత్రం చివరి షెడ్యూల్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ద్వారా 81 మంది కొత్త నటీనటులను దాసరి వెండితెరకు పరిచయం చేస్తున్నారు. దాసరి పద్మ సమర్పణలో సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్రం ప్రోగ్రస్ ను రామకృష్ణ ప్రసాద్ వివరిస్తూ, ఒక సంచలనాత్మక కథ, కొత్త నటీనటీటులు, అదీ తెలుగువారిని పరిచయం చేస్తూ 'యంగ్ ఇండియా' చిత్రాన్ని దాసరి ఎంతో ప్రిస్టేజియస్ గా తెరకెక్కిస్తున్నారని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ కు ఈ చిత్రం నాంది పలుకుతుందని అన్నారు. ఈ చిత్రం కోసం దాసరి రేయింబవళ్లు శ్రమిస్తున్నారని చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ప్రారంభించి ఇంతవరకూ 85 శాతం సినిమా పూర్తి చేశామనీ, ఈనెల 22వరకూ తాజా షెడ్యూల్ ఉంటుందనీ చెప్పారు. ఎం.ఎం.కీరవాణి అద్భుతమైన ఆరు పాటల్ని అందించారనీ, వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనీ తెలిపారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం దాసరి అందిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్.రమణరాజు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|