కేన్సర్ ఫౌండేషన్ కు బాలయ్య
హైద్రాబాద్ కేంద్రంగా కేన్సర్ వ్యాధి నియంత్రణ కోసం కృషి చేస్తున్న 'నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ కేన్సర్ ఫౌండేషన్' సభ్యుడుగా ప్రముఖ సినీనటుడు, నందమూరి బసవతారకం-ఎన్టీఆర్ దంపతుల తనయుడు బాలకృష్ణను ట్రస్ట్ ఎంపిక చేసింది. బాలకృష్ణను ట్రస్ట్ సభ్యుడిగా తీసుకోవాలని గతంలోనే తాము నిర్ణయించామనీ, గత శనివారంనాడు జరిగిన సమావేశానికి సభ్యుడిగా పాల్గొనాలని బాలకృష్ణకు ఆహ్వానం పంపామనీ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు తెలిపారు.
బాలకృష్ణ తమ ఆహ్వానం మేరకు సమావేశానికి హాజరై కేన్సర్ ఫౌండేషన్ కు విరాళంగా 50 లక్షల రూపాయలు ఇచ్చారనీ, ఇదే సమావేశంలో బాలకృష్ణకు నిధుల సమీకరణ కమిటీలో మరో బాధ్యతను కూడా అప్పగిస్తూ నిర్ణయిం తీసుకున్నామనీ ఆయన వివరించారు.
Be first to comment on this News / Article!
|