'కేడి' లక్ష్యం డబ్బే: నాగార్జున
మాస్..బాస్..కింగ్...ఇప్పుడు కేడి. ఇవన్నీ నాగార్జున విభిన్న 'చిత్రా'వతారాలు. ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్నఇతివృత్తాలను ఎంచుకుని నవతరం దర్శకులను ప్రోత్సహించడంలోనే ఆయన సక్సెస్ రహస్యం దాగుంది. 'కింగ్' వంటి హిట్ తర్వాత నాగార్జునతో మళ్లీ కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన స్టయిలిష్ మూవీ 'కేడి'. ఈ బ్యానర్ కు ఇది రజతోత్సవ సంవత్సరం కూడా కావడం విశేషం. ఈ చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో నాగార్జున చెప్పిన 'కేడి' ప్రత్యేకతలు, షూటింగ్ అనుభూతులు, తదుపరి చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే...
కథకు యాప్ట్ టైటిల్...
కథకు అనుగుణంగానే 'కేడి' టైటిల్ నిశ్చయించాం. నిజానికి ఇది నెగిటివ్ టైటిల్ అనో, రెండు అక్షరాలు కలిసొచ్చేలా సెంటిమెంట్ గా టైటిల్ పెట్టామనో ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. గాంబ్లింగ్, కార్ల దొంగతనాల నేపథ్యంలో కథ ఉంటుంది. అలాగే విడుదల తేదీని ముందుగా నిర్ణయించుకుని సినిమా చేయలేదు. డిసెంబర్ లోనే, జనవరిలోనే విడుదల చేయాలన్న సెంటిమెంట్ కూడా లేదు. మంచి సాంకేతిక విలువలు ఉండాలనే పట్టుదలతో సినిమా చేశారు. ముఖ్యంగా డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్ కు నెలరోజులు పట్టింది.
రమేష్...ఉరమ్ రమ్మీ
ఇందులో నా పాత్ర పేరు రమేష్. రమ్మీగా పిలుస్తుంటారు. డబ్బు సంపాదించడమే ఈ కేడి పరమావధి. అందుకోసం పేకాట ఆడతాడు. ఇంతకూ ఆ డబ్బు ఎవరి కోసం సంపాదిస్తున్నాడనేది ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు. తెరపై చూస్తే బాగుంటుంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గుంటూరు నుంచి హైద్రాబాద్ కు, అక్కడ్నించి గోవాకూ కథానాయకుడు ప్రయాణిస్తుంటాడు. ముఖ్యంగా సినిమాకి స్క్రీన్ ప్లే ప్రధాన బలం. సందీప్ చౌతా సంగీతం, సర్వేష్ మురారి ఛాయాగ్రహణం, సెల్వ ఫైట్స్ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. బ్రహ్మానందం పాత్ర నిడివి మరీ పెద్దది కాకపోయినా మరో కేడిగా మారువేషాల్లో కనిస్తూ హీరోకి సాయపడుతుంటాడు. దర్శకుడు కిరణ్ లో మంచి ప్రతిభాపాటవాలు ఉన్నాయి. చాలా స్టయిలిష్ గా చిత్రాన్ని మలిచిన తీరు ప్రశంసనీయం. అలాగే గతంలో నేను నటించిన చిత్రాల్లో మమతా మోహన్ దాస్ నటించింది. 'కింగ్'లో అంతమంది హీరోయిన్లు ఉన్నా మమత ప్రత్యేకంగా కనిపించింది. ఇందుకే హీరోయిన్ గా ఆమెను తీసుకున్నాం. ఎంతో డెడికేషన్ తో నటించింది. ఆలాగే హీరో, హీరోయిన్, విలన్ అని కాకుండా పాత్రధారులంతా చక్కగా నటించారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|