'కేడి' లక్ష్యం డబ్బే: నాగార్జున
ఆల్ రౌండర్ చైతన్య...
సినీ కెరీర్ ప్రారంభంలోనే 'గీతాంజలి' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఒకే తరహా పాత్రలు కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ వచ్చాను. అందుకు నిదర్శనమే 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలు. ఇదే తరహాలో నాగచైతన్య కూడా 'జోష్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా మంచి నటుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఏమాయ చేసావే' చిత్రం ఆడియోకు మంచి స్పందన వస్తోంది. కేవలం ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా అన్ని తరహా పాత్రల్లో చైతన్య నటించి మెప్పుపొందాలని అభిలషిస్తున్నాను.
రాధామోహన్ డైరెక్షన్ లో...
'ఆకాశమంత..' చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడుగా గుర్తింపు పొందిన రాధామోహన్ దర్శకత్వంలోనే నా తదుపరి చిత్రం ఉండబోతోంది. హీరో, హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్ల ప్రాధాన్యం ఉన్న కథాంశమిది. ప్రకాష్ రాజ్, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెలలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది.

Be first to comment on this News / Article!
Pages: -1- -2- 3
|