విశాల్ 'కిలాడీ' మూడోవారంలో
'పందెంకోడి', 'పొగరు', 'భరణి' వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్ కథానాయకుడుగా జి.కె.ఫిలిమ్స్ పతాకంపై విక్రమ్ కృష్ణ నిర్మించిన తాజా చిత్రం 'కిలాడీ'. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి తిరు దర్శకుడు. ఈనెల 3వ వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు వికృమ్ కృష్ణ తెలిపారు.
విశాల్ ఇంవతవరూ నటించనటువంటి ప్లేబాయ్ పాత్రను ఇందులో పోషించారనీ, ఇందులో పాత్రపరంగా ఆయన దేనిని ఎంపిక చేసుకున్నా మూడు విధాలుగా ఆలోచిస్తుంటాడనీ, అలాగే తన జీవిత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురు అమ్మాయిలను ఎన్నుకుంటాడనీ విక్రమ్ కృష్ణ తెలిపారు. అయితే ఆ ముగ్గురిలో ఎవర్ని కిలాడి వరించాడన్నది వెండితెరపై చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుందన్నారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, లవ్ ఆంశాలతో సాగే ఈ చిత్రంలో ఐదు పాటలు ఉన్నాయనీ, యువన్ శంకర్ రాజా అందించిన ఆడియో ఇటీవల సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలై అద్భుతమైన ఆదరణ చూరగొంటోందనీ తెలిపారు. పాటల చిత్రీకరణ కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో చాలా లావిష్ గా తీసినట్టు చెప్పారు. తమ సంస్థకు ఇది మరో మంచి హిట్ చిత్రమవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈనెల మూడోవారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. విశాల్ సరసన తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్ కథనాయికలుగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శశాంక్ వెన్నెలకంటి మాటలు, చంద్రబోస్ పాటలు, అరవింద్ కృష్ణ సినిమాటోగ్రఫీ, సురేష్ ఎడిటింగ్, దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|