'దోపిడి'గా తమిళ 'కురువి'
తమిళంలో విడుదలై పలు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకొన్న 'కురువి' చిత్రం హక్కులను అభి పిక్చర్స్ అధినేత బి.సత్యనారాయణ పొందారు. తొలిసారిగా ఆయన నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 'దోపిడి' పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్, అందాల నటి త్రిష జంటగా నటించారు. ధరణి దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి.
తమిళంలో 25 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రమిదనీ, అక్కడ చాలా పెద్ద సక్సెస్ ను సాధించిందనీ చెప్పారు. ఈ చిత్రం హక్కులు తమకు లభించేందుకు సహకరించిన కరుణానిధి మనవడు ఉదయనిధికి తమ కృతజ్ఞతలని అన్నారు. పేదవారిని బడాబాబులు దోచుకుంటున్న సమాజంలో ఓ లేనివాడు బాగా డబ్బున్న వారిని దోచుకుని పేదలకు ఎలాంటి న్యాయం చేయాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తమని తెలిపారు. ఇందులో మాఫియా డాన్ గా సుమన్ అద్భుతమైన పాత్రను పోషించారనీ, త్రిష హీరోయిన్ గా, మాళవిక మరో పాధ్యాన్నమున్న పాత్రలో నటించినట్టు తెలిపారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాజర్, ఆశిష్ విద్యార్థి, జీవి, వివేక తదితరులు నటించారు. ఎం.రాజశేఖర్ రెడ్డి మాటలు, విద్యాసాగర్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|