ఇరగదీస్తున్న 'ఆర్య-2'
స్టయిలిష్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ సినిమాలకు కేరళలో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. 'ఆర్య', 'దేశముదురు' చిత్రాలకు అప్పట్లో మంచి ఆదరణ లభించింది. తాజాగా 'ఆర్య 2' చిత్రం మరోసారి విజయకేతనం ఎగరేస్తోంది. కేరళలోని మెట్రోస్ లోనే కాకుండా చిన్నచిన్న ఏరియాల్లోనూ అల్లు అర్జున్ కు గణనీయమైన పాపులారిటీ ఉంది. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లోనే 66 సెంటర్ల నుంచి 60 లక్షలకు పైగా షేర్ వసూలు చేసి మలయాళ స్టార్ హీరోల మతులు పోగొడుతోంది.
మలయాళ మార్కెట్ లో 3 రోజుల్లో 60 లక్షలంటే మూమూలు విషయం కాదు. 'ఆర్య-2' విడుదలైన రోజే తమిళంలో బిగ్ బడ్జెట్ చిత్రంగా రూపొందిన అజిత్ 'అసల్' సినిమా కూడా విడుదలైంది. అయితే 'ఆర్య-2' ధాటికి ఆ చిత్రం విలవిలలాడుతోందనీ, ఇప్పటికీ అన్ని సిటీ సెంటర్లలోనూ 90 శాతానికి పైగా వసూళ్లు రాబట్టుకోవడంతో అల్లు అర్జున్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ సైతం ఇక ముందు తన సినిమాల్లో తప్పనిసరిగా కేరళ నటులు ఉండేలా చూసుకోవడం, అక్కడి వారి వేషభాషాలను తన సినిమాల్లో అనుకరించడం చేయాలని ఈమధ్యనే ఓ స్ట్రాంగ్ డెషిషన్ తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళలో కూడా ఏకకాలంగా తన సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకోవాలనుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|