నాగార్జున పెద్దరికం...
వెండితెర 'మన్మథుడు' నాగార్జున పరిశ్రమలోకి వచ్చి పాతికేళ్లయింది. అక్కినేని నాగేశ్వరరావు ఎవర్ గ్రీన్ హీరో అయితే, నాగార్జున ప్రయోగాలకు కూడా పెద్ద పీట వేసి, రొమాంటిక్ హీరోగా కూడా తన ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు నాగచైతన్య హీరో కావడం, మరో తనయుడు 'సిసింద్రీ' అఖిల్ 15వ పడిలోకి అడుగుపెట్టి ఇవాళో రోపో హీరోగా వచ్చే అవకాశాలు ఉండటంతో నాగార్జున సైతం తన ఇమేజ్ ను మార్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన మునుముందు హీరో రేంజ్ ఎంతనేది కాకుండా పాత్ర రేంజ్ ను బట్టి సినిమాలు ఒప్పుకోవాలనీ, రొటీన్ రొమాంటిక్ యాంగిల్ నుంచి డిగ్నిఫైట్ క్యారెక్టర్ల వైపు దృష్టి సారించాలనీ అనుకుంటున్నారట.
నాగార్జున తన తాజా ఇంటర్వ్యూలో 'ఆకాశమంత' చిత్రం దర్శకుడు రాధామోహన్ తో తన తదుపరి చిత్రం ఉంటుందనీ, హీరో రేంజ్ ఎంతని కాకుండా క్యారెక్టర్ బేస్డ్ రోల్ ఇందులో పోషిస్తున్నాననీ చెప్పుకొచ్చారు. అలాగే 'కేడి'లో రొమాన్స్ తక్కువేననీ, రాధామోహన్ చిత్రంలో అయితే రొమాన్స్ కు ఛాన్సే లేదనీ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆయన మాటలను బట్టి నాగచైతన్య బరిలో దిగిన తర్వాత కూడా ఇంకా రొమాంటిక్ హీరో అనిపించుకోవడం అంతగా బాగుండదనే అభిప్రాయంతో పాటు ఇక నుంచి డిగ్నిఫైడ్ పాత్రలకే తన ప్రాధాన్యం ఉంటుందని నాగార్జున ఫీలర్లు వదిలినట్టు అనుకోవచ్చు. స్టార్ ఇమేజ్ అనేది ఓ సమ్మోహన శక్తి కాబట్టి ఇప్పటికి ఇప్పుడే కాకపోయినా ఓ నాలుగైదేళ్లలో నాగ్ క్రమంగా తన ఇమేజ్ మార్చుకుని కొత్త ప్రయోగాల వైపు మళ్లనూ వచ్చు. పనిలో పనిగా తన ఫ్యామిలీకి చెందిన మూడు జనరేషన్ల హీరోలతో (ఎఎన్ఆర్, నాగ్, నాగచైతన్య) భవిష్యత్తులో ఓ సినిమా చేసేందుకు కూడా నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా పెద్దరికం బాధ్యతే కదూ?!
Be first to comment on this News / Article!
|