వర్మ 'ఆవహం' ఏప్రిల్ 9న
రామ్ గోపాల్ వర్మ 'రణ్' చిత్రం తర్వాత హారర్ ఫిల్మ్ 'ఆవహం' ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ సమర్పణలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం మూడు భాషల్లోనే ఏకకాలంలో విడుదల కానుంది. దీనికి మిలింద్ గడార్కర్ దర్శకుడు.
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, హిందీలో 'ఫూంక్ 2', తమిళంలో 'బొమ్మాయి 2', తెలుగులో 'ఆవహం' పేరుతో ఈ చిత్రం రూపొందుతోందని అన్నారు. రచయిత మిలంద్ ఈ చిత్రం కాన్సెప్ట్ చెప్పగానే ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాననీ, గతంలో వచ్చిన హారర్ చిత్రాలన్నికంటే ఈ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా భయపెడుతుందనీ అన్నారు. నిర్మాతత ప్రశాంత్ బుర్రా మాట్లాడుతూ, అమితాబ్ 'రణ్' చిత్రంతో పాటే 'ఆవహం' ట్రైలర్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశామనీ, చాలా మంచి స్పందన లభించిందనీ చెప్పారు. షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతోందనీ తెలిపారు. సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా 1000 ప్రింట్లతో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. సుదీప్, అమృత కన్విల్కర్, ఎహసాన్ చన్నా, రిషబ్ జైన్, అను అన్సారి, గణేష్ యాదవ్, మనీష్ ఖన్నా తదితరులు నటించిన ఈ చిత్రానికి చంద్రకాంత్ వసంత్ మెహర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|