'మరోచరిత్ర' సాంగ్స్ 14న
'మరోచరిత్ర' పేరు చెప్పగానే కమల్ హాసన్, సరిత జంటగా కె.బాలచందర్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన సంచలన చిత్రమే గుర్తుకు వస్తుంది. అప్పట్లో ప్రేమకథా చిత్రాలకు ఇదో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 'మరోచరిత్ర' మోడ్రనైజ్ వెర్షన్ లో దిల్ రాజు నిర్మాతగా రవియాదవ్ దర్శకత్వంలో రూపొందుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 14న ఆడియో రిలీజ్ కానుంది.
కె.బాలచందర్ 'మరోచరిత్ర'కు మోడ్రన్ వెర్షన్ గా కొత్త కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు రవియాదవ్ చెబుతున్నారు. ఇందులో హీరో తెలుగు యువకుడు కాగా, హీరోయిన్ ఆంగ్ల యువతి. అలాగే పాత మరోచరిత్రకు భిన్నంగా ఇందులోని క్లైమాక్స్ ఉండబోతోంది. హైద్రాబాద్, కెనడా, యుఎస్, దుబాయ్, వైజాగ్ లలో షూటింగ్ జరిపారు. వరుణ్ సందేశ్, అనిత (నూతన పరిచయం) జంటగా నటించారు.
శ్రద్దాదాస్ మరో కీలక పాత్ర పోషించింది. మిక్కీ జె.మేయర్ సంగీతం అందించగా, కెమెరామన్ కూడా అయిన రవియాదవ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా శిరీష్, లక్ష్మణ్ వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జుగుతున్నాయి.
Be first to comment on this News / Article!
|