నటి నీరోషా ఆస్తుల వేలం
నటి నిరోషా గుర్తుండే ఉంటుంది. సీనియర్ నటి రాధిక చెల్లెలు. తెలుగులో 'నారీ నారీ నడుమ మురారి', 'ఘర్షణ' (మణిరత్నం చిత్రం), 'కొబ్బరిబొండాం', 'మధురానగరిలో' వంటి చిత్రాల్లో ఆమె నటించింది. కెరీర్ ఆశావహంగా ఉన్న తరుణంలో హీరో రాంఖీని ('సింధూరపువ్వు' ఫేమ్) పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడింది. రాఖీ తమిళంలో నిలదొక్కుకోలేకపోవడంతో కొద్దికాలంగా బిజినెస్ పనులు చూసుకుంటూ. సింహళ భాషలో టెలివిజన్ సీరియల్స్ చేస్తూ వచ్చారు. ఇటీవలే ఆయన దర్శకుడిగా మారనున్నట్టు ప్రకటించి తమిళంలో పెద్ద స్టార్స్ తో ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అయితే అది పూర్తిగా కార్యరూపంలోకి రాకముందే నిరోష-రాఖీ దంపతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వీరి ఆస్తులను చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బేక్ పబ్లిక్ వేలానికి పెట్టింది.
వ్యాపారం కోసం ఈ దంపతులు కొద్దికాలం క్రితం తమ ప్రాపర్టీని చూపించి ఐ.ఓ.బి.లో రుణం తీసుకున్నారు. అయితే ఆ బాకీని ఇంతవరకూ చెల్లించకపోవడంతో బ్యాంకు పలు రిమాండర్ల తర్వాత ఆస్తుల పబ్లిక్ వేలానికి దిగింది. నీరోషా దంపతులు రుణం తీసుకున్న ఐఓసి బ్రాంచ్ లోనే మార్చి 10న ఈ వేలం జరుగనుంది.
Be first to comment on this News / Article!
|