రక్షకులు..బ్రేక్ ది రూల్స్
ఈశ్వర్, ప్రేరణ, ఉదయ్, నీహారిక హీరో హీరోయిన్లుగా రవివర్మ ఎం దర్శకత్వంలో వి.ఆర్.రెడ్డి, వేణు నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్ టైనర్'రక్షకులు'. దీనికి 'బ్రేక్ ద రూల్స్' అనే ట్యాగ్ లైన్ ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.
కమర్షియల్ అంశాలతో కూడిన చక్కటి ఇతివృత్తంతో ఈ చిత్రం ఉంటుందని సమర్పకుడు వెంకట్ భగవాన్ తెలిపారు. హైద్రాబాద్ లో ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతోందన్నారు. ఈనెల 20 నుంచి బ్యాలెన్స్ ఉన్న పాటను చెన్నైలో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. తమిళ, తెలుగు భాషల్లో ఈకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రామిరెడ్డి, సత్యప్రకాష్, కొండవలస, కాదల్ దండపాడి, షకీలా, వెంకట్ భగవాన్, జయ, జెమిని రాఘవ నటించారు. కె.మాధవరెడ్డి మాటలు, కల్యాణ్ కె.సమి సినిమాటోగ్రఫీ, సత్యం ఎడిటింగ్, వరంగల్ శ్రీనివాస్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|