సాయికిరణ్ 'ప్లాన్' ఏమిటి?
సాయికిరణ్ కథానాయకుడుగా ఎన్.కె.జి.ప్రొడక్షన్స్ పతాకంపై నరేష్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ప్లాన్'. గుప్తనిధికి సంబంధించిన కథతో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటూ ఫస్ట్ కాపీకి రెడీ అవుతోంది.
దర్శకనిర్మాత నరేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సాయికిరణ్ హీరోగా తమ బ్యానర్ లో వస్తున్న మూడో చిత్రమిదనీ, మరో పది రోజుల్లో తొలి కాపీ వస్తుందనీ చెప్పారు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఒక నిధి సాధించేందుకు చేసే ప్రయత్నంలో ఆ నిధిని ఎలా కనుగొన్నారన్నదే ఈ చిత్ర కథాంశమనీ, సాయికిరణ్, అతని స్నేహితుల పాత్రలు అందర్నీ ఆకట్టుకుంటాయనీ చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి మార్చిలో సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఒకే సంస్థలో వరుసగా మూడు చిత్రాలు చేయడం ఆనందంగా ఉందని సాయికిరణ్ తెలిపారు. ఈ చిత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో మమత, రామిరెడ్డి, కొండవలస, జాకీ, గిరి, గ్లోరి, చిట్టిబాబు, రాగిణి, శ్లీలత తదితరులు నటించారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం నరేష్ కుమార్ గుప్తా అందించిన ఈ చిత్రానికి వీణా సి.ఆనంద్ సినిమాటోగ్రఫీ, సాయి వెంకట్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|