సౌందర్య రజనీ నిశ్చితార్ధం 17న
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాడిఎంకె అధినేత్రి జయలలితను ఇటీవల పోయిస్ గార్డెన్స్ రెసిడెన్స్ లో కలుసుకున్నారు. అయితే వీరి కలయిక పూర్తిగా ప్రైవేటు వ్యవహారమే కానీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు . రజనీకాంత్ కుమార్తె సౌందర్యం నిశ్చితార్ధానికి జయలలితను ఆహ్వానించేందుకే రజనీ ఆమెను కలుసుకున్నారు. ఈనెల 17న చెన్నైలోని పార్క్ షెరటాన్ హోటల్ లో సౌందర్య రజనీకాంత్, పారిశ్రామిక వేత్త అశ్విన్ ల నిశ్చితార్ధం జరుగనుంది. రజనీకాంత్, ఆయన సతీమణి స్వయంగా పలువురు విఐపిలను ఇప్పటికే కలుసుకుని నిశ్చితార్ధానికి ఆహ్వానించారు.
చెన్నైకి చెందిన బిజినెస్ మేగ్నెట్ రామ్ కుమార్ తనయుడే అశ్విన్. సౌందర్య ఇప్పటికే ఓచర్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. తన తండ్రి రజనీకాంత్ తో 60 కోట్ల భారీ బడ్జెట్ తో 'సుల్తాన్ ది వారియర్' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా 3000 ప్రింట్లతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి తోడు ఇటీవలే తమిళంలో 'గోవా' అనే చిత్రాన్ని కూడా సౌందర్య నిర్మించారు. ఆమె సోదరి ఐశ్వర్య కొద్దికాలం క్రితమే హీరో ధనుష్ ను పెళ్లాడింది. అయితే సినీ నేపథ్యం లేని వ్యక్తికే సౌందర్య ప్రాధాన్యం ఇచ్చిందనీ, వీరిది కూడా 'లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్' అనీ సన్నిహిత వర్గాల భోగట్టా. సౌందర్య వివాహ ముహూర్తం ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|