ప్రభాస్ తండ్రి కన్నుమూత
హీరో ప్రభాస్ తండ్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్ లో కన్నుమూశారు. అస్వస్థత కారణంగా కొద్దిరోజుల క్రితం హైద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో సూర్యనారాయణరాజు చేరారు. వైద్య చికిత్స పొందుతూ నేటి ఉదయం ఆయన అంతిమశ్వాస విడిచారు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజుకు భార్య శివకుమారి, ప్రభాస్, ప్రబోధ్ లతో పాటు కుమార్తె ప్రగతి ఉన్నారు.
కృష్ణంరాజుతో కలిసి గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై సూర్యనారాయణ రాజు ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 'భక్తకన్నప్ప', 'కృష్ణవేణి', 'అమరదీపం', 'బొబ్బిలి బ్రహ్మన్న' వంటి ఎన్నో హిట్ చిత్రాలు ఈ బ్యానర్ లో రూపొందాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతదేహాన్ని చివరిసారిగా సందర్శించుకుని నివాళులర్పించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో నేటి సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి.
Be first to comment on this News / Article!
|