విదేశాలకు వెళ్తున్న 'సింహా'
బాలకృష్ణను ఓ పవర్ ఫుల్ పాత్రలో చూపిస్తూ భారీ హంగులతో రూపొందుతున్న చిత్రం 'సింహా'. నయనతార, స్నేహఉల్లాల్, నమిత కథానాయికలు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, బాలకృష్ణ, ఆంగికం, వాచకం, అభినయం వంటివన్నీ ఈ చిత్రంలో కొత్తగా ఉంటాయని ప్రేక్షకులు, అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రం తెరకెక్కుతోందనీ చెప్పారు. స్టన్ శివ, రామ్-లక్ష్మణ్ ల సారథ్యంలో రూపొందిన ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనీ, అలాగే ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన నృత్యరీతులు, బాలకృష్ణ స్టెప్స్ అలరిస్తాయని చెప్పారు. కళా దర్శకుడు ఎ.ఎస్.ప్రకాష్ ఈ చిత్రం కోసం పలు భారీ సెట్స్ వేశారనీ, ఆర్దర్ ఎ.విల్సన్ ఫోటోగ్రఫీ కనువిందు చేస్తుందనీ అన్నారు. చక్రి వీనుల విందైన సంగీతం అందించినట్టు చెప్పారు. ఇందులో నయనతార పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ముగ్గురు హీరోయిన్లకు బాలకృష్ణతో రెండేసి పాటలు చొప్పున ఉంటాయని తెలిపారు. హైద్రాబాద్ షూటింగ్ అనంతరం విదేశాల్లో పాటలను చిత్రీకరిస్తామని పరుచూరి కిరీటి తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కె.ఆర్.విజయ, కిన్నెర, సన, ఝాన్సీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, కృష్ణభగవాన్, వేణుమాధవ్, ఎల్బీ శ్రీరామ్, సాయికుమార్ తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం బోయపాటి శ్రీను అందిస్తున్న ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|