'అందరి బంధువయ' రెడీ
'ఆ నలుగురు', 'మధుమాసం' వంటి చక్కటి చిత్రాలను అందించిన దర్శకుడు చంద్ర సిద్దార్ధ మరో చక్కటి ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం
'అందరి బంధువయ' . శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించారు. యుటోపియా ఎంటర్ టైనర్స్ పతాకంపై ఆర్.కె. నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది.ఈ వారంలోనే తొలికాపీ రెడీ అవుతుంది. ఇదే నెలాఖరులో సినిమా విడులకు ప్లాన్ చేస్తున్నట్టు చంద్రసిద్దార్ధ తెలిపారు.
అందరి బంధువైన ఓ వ్యక్తి కథే ఈ చిత్రమనీ, కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ముందుగా చెప్పడం కంటే వెండితెరపై చూస్తే ఆసక్తికరంగా ఉంటుందనీ అన్నాయి. ఇందులో చక్కటి ప్రేమకథ కూడా ఉందన్నారు. ఇటీవల మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తోందనీ, ఇందులోని ఏడు పాటలు సినిమాలో వేటికవే హైలైట్ గా ఉంటాయనీ అన్నారు. ఈ నెలాఖరులో సినిమా విడుదలవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి చైతన్య ప్రసాద్ పాటలు, జె.కె.గుమ్మడి సినిమాటోగ్రఫీ, అనూప్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|