ఆదరణ తగ్గలేదు: అల్లు
తెలంగాణ అంశంపై అల్లు అర్జున్ తొలిసారి పెదవి విప్పారు. సినీ పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రజలు ఎంతో ఔదార్యం ప్రదర్శిస్తుంటారనీ, సినిమాల విషయం వచ్చినప్పుడు ఎలాంటి వైరుధ్యాలు చూపించరనీ ఆయన కితాబిచ్చారు. కాలేజీ స్టూడెంట్స్ తో హైద్రాబాద్ లో శుక్రవారం జరిపిన ముఖాముఖీలో ఊహించని విధంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన మొదట్లో కొంచెం తడబడినా ఆ తర్వాత తనదైన శైలిలో సమాధానం చెప్పి అందర్నీ ఆకట్టుకున్నారు.
హైద్రాబాద్ లోనే తాను పుట్టి పెరిగాననీ, తమ కుటుంబ సభ్యుల చిత్రాలన్నీ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయనీ ఆయన అన్నారు. రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి చూడటం ఎంత మాత్రం సరికాదని అన్నారు. తనతో పాటు ఇక్కడుకు హాజరైన వారంతా హైదరాబాదీయులేనని అంటూ సినిమాల ప్రస్తావన వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్ర అనే తేడా ఉండదని, అందరికీ వినోదం, సినిమావారికీ అందరూ కావాలని సమయోచితమైన సమాధానం చెప్పారు.
Be first to comment on this News / Article!
|