'కంత్రీమొగుడు' పాటలు
బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునే హీరోయిన్ గా కన్నడంలో రూపొందిన సిల్వర్ జూబ్లీ హిట్ చిత్రం 'ఐశ్వర్య'. దీనిని 'కంత్రీమొగుడు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర టైటిల్ రోల్ పోషించారు. ఇంద్రజిత్ వెంకటేష్ దర్శకుడు. ఉమామహేశ్వరి ఫిలింస్ పతాకంపై రూపకుమార్ వి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తొలి కాపీ కూడా సిద్ధమైన ఈ చిత్రం ఆడియోను ఫిలిం చాంబర్ ప్రివ్యూ థియేటర్ లో రిలీజ్ చేశారు. ఆడియో సీడీని నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ ఆవిష్కరించి తొలి ప్రతిని సంగీత దర్శకుడు ఎం.ఎం.శ్రీలేఖకు అందించారు.
లవ్, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రిచ్ వాల్యూస్ తో రూపొందిందని నిర్మాత రూపకుమార్ తెలిపారు. ఇందులోని ఐదు పాటలు ఉన్నాయనీ, ఒక్కో పాటను ఒక్కో దేశంలో చిత్రీకరించామని అన్నారు. స్ట్రయిట్ సినిమా స్థాయిలో మంచి క్వాలిటీతో డబ్బింగ్ పనులు చేసినట్టు పేర్కొన్నారు. దీపిక పడుకునే నటించగా తెలుగులో వస్తున్న తొలిచిత్రం ఇదే కావడం విశేషమనీ, ఇపేంద్ర విభిన్న గెటప్ లతో ఎంతో గ్లామర్ గా కనిపిస్తారనీ చెప్పారు. మార్చిలో సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి డి.గోపాలకృష్ణ సమర్పకులుగా వ్యవహస్తుండగా, భారతీబాబు మాటలు-పాటలు, నాని ఎడిటింగ్, రాజేష్ రామ్ నాథ్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|