'ఛలో వన్..టూ..త్రీ'
కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం 'ఛలో వన్ టూ త్రీ'. సాయికిరణ్, శివాజీ హీరోలుగా, కీర్తి హీరోయిన్ గా నటించింది. ఎస్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై అల్లాడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్రామ్ పల్లా దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇదే నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇదొక ముక్కోణ ప్రేమ కథా చిత్రమనీ, రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఐదు పాటలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనీ వెంకట్రామ్ పల్లా చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బాబూమోహన్, జయరమేష్, రామిరెడ్డి, రామారావు, అల్లరి సుభాషిణి తదితరులు నటించారు. బేబి శ్రీహిత సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి ఉపేంద్ర మాటలు, శూలం ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అవినాష్ ఫైట్స్ అందించారు.
Be first to comment on this News / Article!
|