నాగ్ కాలర్ ట్యూన్?
అక్కినేని మూడోతరం వారసుడైన నాగచైతన్య తొలి చిత్రం 'జోష్' బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోయినా తొలిచిత్ర హీరోగా నాగచైతన్య నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. రెండో చిత్రమే గౌతమ్ మీనన్, ఎ.ఆర్.రెహ్మాన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం 'ఏమాయ చేసావే' చిత్రంతో నాగచైతన్యకు లభించింది. ఇది యూత్ ఫుల్ ఫిలిం కావడంతో రైట్ టైమ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని, ఈలోగా చిత్ర మ్యూజిక్ అన్నివర్గాల ప్రజలకు బాగా చేరువ చేయాలని నాగార్జున ప్లాన్ లోనే భాగంగా ఇటీవల ఈ చిత్రం ఆడియోను సైలెంట్ గా రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఆడియో స్లోగా ఉందనే మాట వినిపిస్తున్నప్పటికీ క్రమంగా పికప్ అవుతూ మ్యూజిక పరంగా హిట్ కు చేరువలో ఉంది. తాజాగా నాగార్జున సైతం ఈ చిత్రంలోని 'ఈ హృదయం' అనే పాటను ఇప్పుడు తన మొబైల్ ఫోన్ కు కాలర్ ట్యూన్ చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. నాగార్జనకు ఇది తొలి కాలర్ ట్యూన్ కావడం విశేషం.
'ఏ మాయ చేసావే' చిత్రానికి రెహ్మాన్ అందించిన సంగీతం సమ్మోహనపరచేలా ఉంది. మ్యూజిక్ వింటుంటే ఒకప్పుడు నేను నటించిన గీతాంజలి చిత్రం గుర్తుకొస్తోంది. ఆ చిత్రం ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఎంటర్ టైనింగ్ ఫిల్మ్ కేటగిరిలో సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ క్రెడిట్ నిశ్చయంగా మణిరత్నం, రెహ్మాన్ లకే దక్కుతుంది. 'ఏమాయ చేసావే' చిత్రంతో గౌతమ్ మీనన్- రెహ్మాన్ మళ్లీ అలాంటి మ్యాజిక్ పునరావృతం చేస్తారనే నమ్మకం నాకుంది. గీతాంజలి రికార్డులు కూడా బద్దలుకొడుతుందని అనుకుంటున్నాను' అని నాగార్జున ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో చెప్పారు. ఈ చిత్రాన్ని విద్యార్థుల పరీక్షలు, ఐపిఎల్ సీజన్ పూర్తయ్యే నాటికి మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
Be first to comment on this News / Article!
|