చార్మి 'ఇందు' 26న
ఛార్మి టైటిల్ పాత్రలో నటించిన ఓ తమిళ చిత్రం 'ఇందు' పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది. బిబిఎస్ స్టూడియో బ్యానర్ పై టి.శ్రీనాగవర్మ సమర్పణలో మురారిశెట్టి లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'చంద్రముఖి' ఫేమ్ పి.వాసు దర్శకుడు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే శరవణ మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈనెల 26న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే కథాంశంతో ఈ చిత్రకథ ఉంటుందనీ, ఆడపిల్లలను అభిమానంతో కాలేజీలకు పంపాలే తప్ప అనుమానంతో కాదనే ఇతివృత్తంతో తమిళంలో వచ్చిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించిందనీ చిత్ర నిర్మాత లక్ష్మణ్ తెలిపారు. సరికొత్త కథ కథనాలతో పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కించారనీ, మలేసియాలోని కాలేజీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనీ చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోందనీ, వారాంతంలో ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక నిర్వహించి ఈనెల 26న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. కథ-స్క్రీన్ ప్లే సైతం పి.వాసు అందించిన ఈ చిత్రానికి కేశవన్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, విద్యాసాగర్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|