'కిలాడి' చంద్రుడు
'పందెంకోడి', 'పొగరు' వంటి హిట్ చిత్రాల హీరో విశాల్ ఇటీవల ఎన్ని కసరత్తులు చేసినా సక్సెస్ ముఖం చాటేస్తోంది. గత చిత్రం 'పిస్తా' ఫ్లాప్ కావడంతో తనకున్న యాక్షన్ ఇమేజ్ కు కొంత మార్పు చేసి రొమాంటిక్ హీరోగా 'కిలాడీ'లో కనిపించబోతున్నారు. వచ్చే వారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణ తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో తిరు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో విశాల్ ప్లేబాయ్ తరహా పాత్ర పోషించారు. ఆయన సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మలు తనుశ్రీదత్తా, నీతూచంద్ర, సారాజైన్ నటించారు. ఆసక్తికరంగా ఈ చిత్ర కథ మన తెలుగు హీరో సిద్దార్ధ 'చుక్కల్లో చంద్రుడు'కు చాలా దగ్గరగా ఉంది.
హీరో విశాల్ 'కిలాడి'లో పాత్రపరంగా దేనిని ఎంపిక చేసుకున్నా మూడు విధాలుగా ఆలోచిస్తుంటాడు. తన జీవత భాగస్వామి విషయంలో కూడా ముగ్గురమ్మాయిలను ఎంచుకుంటాడు. ఇందులో ఒకరు కాలేజీ స్టూడెంట్ అయితే, మరొకరు స్పోర్ట్ ఉమన్, ఇంకొకరు సామాజిక కార్యకర్త. వీరిలో ఎవరిని మన కిలాడీ ఎంచుకున్నాడనేది సస్పెన్స్. ఇది సరిగ్గా 'చుక్కల్లో చంద్రుడు' స్టోరీ ప్లాటే. సిద్దార్ధ ఇందులో హీరో మాత్రమే కాకుండా కథ కూడా అందించారు. ఓ పాట పాడారు. ఇన్ని చేసినా సినిమా ఫ్లాప్ అయింది. మరి విశాల్ 'కిలాడీ' ఇందుకు భిన్నంగా సక్సెస్ అయి ఆయన కెరీర్ కు సరైన బ్రేక్ ఇస్తుందా అనేది మరో వారంలో తేలుతుంది.
Be first to comment on this News / Article!
|