కార్తితో ఇద్దరు బ్యూటీలు!
హీరో కార్తి ఈమధ్యనే అనువాద చిత్రం 'యుగానికి ఒక్కడు'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్ తో తీసిన పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు నుంచి మంచి ఓపినింగ్స్ కూడా వచ్చాయి. స్టార్ హీరో సూర్య తమ్ముడైన కార్తి రెండేళ్లకు ఒక సినిమా చొప్పున ఇప్పటికి రెండు సినిమాలే చేసినా ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ యువతరం హీరోలకు గట్టిపోటీ ఇవ్వబోతున్నారు. తాజాగా ఆయన హీరోగా 'సిరుతై' అనే తమిళ చిత్రం స్టూడియె గ్రీన్ బ్యానర్ లో తెరకెక్కనుంది. రవితేజ కథానాయకుడుగా తెలుగులో పెద్ద సక్సెస్ సాధించిన 'విక్రమార్కుడు' చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం.
ఈ చిత్రంలో కార్తి సరనన గ్లామర్ బ్యూటీ ప్రియమణి, తెలుగు వెర్షన్ కథానాయిక అనుష్క నటించనున్నట్టు సమాచారం. కార్తి తొలిచిత్ర కథానాయిక కూడా ప్రియమణే. ఇద్దరూ కలిసి నటించిన 'పరుత్తివీరన్' తమిళంలో పెద్ద సక్సెస్ సాధించి అదే చిత్రంలోని నటనకు గాను ప్రియమణికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ ను పునరావృతం చేసేందుకు స్టూడియో గ్రీన్ పట్టుదలగా ఉంది. ఇదే తరుణంలో అనుష్కకు తెలుగులోనూ, తమిళంలోనూ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ లో ఆమెను కూడా చేర్చేందుకు ప్లానింగ్ జరుగుతోంది. అదే జరిగితే 'సిరుతై' నిస్సందేహంగా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. తెలుగులో 'శౌర్యం', 'శంఖం' చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ ఈ తాజా చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. వహించనున్నారు. ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్టయితే పేరు మార్పుతో మన సినిమా మనకే మళ్లీ అనువాదరూపంలో చూపిస్తారు కూడా. అన్నట్టు...'పరుత్తి వీరన్' సైతం 'పల్నాటి వీరుడు' పేరుతో తెలుగులోకి అనువాదమవుతోంది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|