'అనితా...ఓ అనితా'
ఆంధ్రప్రదేశ్ లో 'అనితా ఓ అనితా' పాట గురించి తెలియని వారు కానీ, వినని వాళ్లు కానీ ఉండకపోవచ్చు. ఆ పాటతో వచ్చిన ఆల్బమ్ లెక్కకు మించిన కాపీలు అమ్ముడుపోవడమే ఆ పాటకున్న క్రేజ్ కు నిదర్శనంగా చెప్పొచ్చు. ఆ పాటను నాగరాజు అనే యువకుడు ఆలపించారు. ఆ పాట ఆధారంగానే ఇప్పుడు ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు చరణ్ రాజ్ ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి నాగరాజు స్వయంగా మూలకథ అందిస్తున్నారు.
నాగరాజును స్వయంగా కలుసుకుని మాట్లాడిన తర్వాత ఆయన మూలకథ ఇచ్చేందుకు సమ్మతించడంతో వెంటనే సినిమాకు ప్లాన్ చేశాననీ, దీనిని సి.ఆర్.క్రియేష్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నాననీ చరణ్ రాజ్ తెలిపారు. అన్ని వాణిజ్య అంశాంలతో అద్భుత ప్రేమకావ్యంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామనీ, హీరోహీరోయిన్ల వివరాలను మరోసారి తెలియజేస్తామని అన్నారు. ఇతర పాత్రల్లో రావురమేష్, రఘుబాబు, సంధానభారతి తదితరులు నటించనున్నారు. ఎం.హరనాథరావు మాటలు, రవి అల సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|