'మరోచరిత్ర' ఆడియో రిలీజ్
వరణ్ సందేష్ మాట్లాడుతూ, 'కొత్త బంగారులోకం' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుటు రవియాదవ్ ను తాను కలుసుకున్నాననీ, 'హ్యాపీడేస్'లో తన నటన బాగా నచ్చినట్టు ఆయన చెప్పారనీ, ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ అన్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ తనకు బాగా నచ్చినవేననీ, ముఖ్యంగా 'యే తీగ..' పాటంటే చాలా ఇష్టమనీ అన్నారు. అనుష్క మాట్లాడుతూ, 'హ్యాపీడేస్' నుంచి తాను మిక్కీ జె.మేయర్ అభిమానిననీ, ఈ సినిమాలోని పాటలను ఎలా చిత్రీకరించారో చూడాలని ఎంతో ఆతృతగా తాను ఎదురుచూస్తున్నాననీ అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ, ముఫ్పై రెండేళ్ల క్రితం నాటి క్లాసిక్ మూవీని రీమేక్ చేయడమనే ఆలోచన వచ్చినప్పుడు మొదట్లో కొద్దిపాటి టెన్సన్ పడ్డాననీ, సినిమా తీయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి పదిహేను రోజులు పట్టిందనీ అన్నారు. చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రారంభించినప్పటికీ సినిమా పూర్తయ్యే సరికి పెద్ద బడ్జెట్ మూవీ అయిందని అన్నారు. క్లాసిక్ మరోచరిత్రను ఇవాల్టి మోడ్రన్ ఆడియెన్స్ అభిరుచికి దగ్గరగా తెరకెక్కించామనీ, రవియాదవ్ సినిమాటోగ్రఫీ విజుయవల్ ఫీస్ట్ గా నిలుస్తుందనీ అన్నారు. సంగీతం సక్సెస్ కావడంతో సినిమాకూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|