'మరోచరిత్ర' ఆడియో రిలీజ్
వరుణ్ సందేష్, అనిత (తొలి పరిచయం) జంటగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి యాదవ్ దర్శకత్వంలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'మరో చరిత్ర'. ఈ చిత్రం ఆడియో వేడుక ప్రేమికుల రోజు సందర్భంగా తారామతి బారాదరిలో ఆదివారం సాయంత్రం జరిగింది. చిత్ర నటీనటులైన వరుణ్ సందేశ్, అనిత, శ్రద్ధాదాస్, ఆదర్శ్ బాలకృష్ణతో పాటు దిల్ రాజు, రవియాదవ్, మిక్కీ జె.మేయర్ తదితరులు పాల్గొన్నారు. రామ్ చరణ్ తేజ, అనుష్క, ఎంఎం కీరవాణి, వి.వి.వినాయక్, అల్లు అర్జున్, ఛోటా కె.నాయుడు, భోగవల్లి ప్రసాద్, దశరథ్, పైడిపల్లి వంశీ తదితురులు అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని రామ్ చరణ్ ఆవిష్కరించి తొలి ప్రతిని వినాయక్ కు అందించారు. ఆడియో క్యాసెట్లను కీరవాణి ఆవిష్కరించి అనుష్కకు అందించారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ, ఓ వారం రోజుల క్రితం ఈ చిత్రం సిడిని తనకు ఇచ్చినప్పుడు వాటిని ఐపాడ్ లో డౌన్ లోడ్ చేసుకున్నాననీ, మళ్లీ మళ్లీ వినాలపించేలా పాటలు ఉన్నాయనీ, ఇది వాలంటైన్స్ కానుకగా చెప్పవచ్చనీ అన్నారు. ఎప్పటికప్పుడు వైవిధ్యంగా కనిపించేందుకు వరుణ్ సందేష్ కష్టపడుతున్నారనీ, అలాగే తొలిసారి దర్శకత్వం వహిస్తున్న రవియాదవ్ కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. ఈ చిత్రంలోని సాంగ్స్ విన్న తరువాత మిక్కీ జె.మేయర్ కు ఎలాంటి అభద్రతా భావం లేదనే అభిప్రాయం తనకు కలిగినట్టు ఎం.ఎం.కీరవాణి అన్నారు. మెక్కీ జె.మేయర్ పూర్తిగా మెలోడీపై ఆధారపడి సాంగ్స్ చేస్తున్నారనీ, అలాంటి సంగీతాన్ని
ప్రోత్సహిస్తున్న దిల్ రాజును అభినందించాల్సి ఉంటుందనీ అన్నారు. అల్లు అరవింద్ తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ, కమల్ హాసన్ 'మరోచరిత్ర' షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నప్పుడు ఆయనతో ఓ సినిమా నిర్మించాలనే ఆలోచనతో అక్కడకు వెళ్లాననీ, అయితే రెండ్రోజుల వరకూ కమల్ అపాయింట్ మెంట్ తనకు దొరకలేదనీ అన్నారు. ఆ తర్వాత బాలచందర్ ను కలవడం, ఆయన కమల్ కు సిఫారసు చేయడం జరిగిందన్నారు. మంచి దర్శకుడితో వస్తే తాను నటించడానికి సిద్ధమని కమల్ తనతో చెప్పారనీ, అయితే ఇప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదనీ అన్నారు. ఆ తర్వాత 'మరోచరిత్ర' రిలీజ్ కావడం బ్లాక్ బస్టర్ కావడం జరిగిందన్నారు. ఈ చిత్రాన్ని తాను తన గర్ల్ ఫ్రెండ్ తో చూశాననీ, ఆమె ఆ తర్వాత తన భార్య అయిందనీ అల్లు అరవింద్ నవ్వుతూ చెప్పారు. క్లాసిక్ 'మరోచరిత్ర' రీమేక్ లో తాను కూడా భాగం కావడం చాలా సంతోషంగా ఉందని మిక్కీ జె.మేయర్ అన్నారు. భలె భలే మగాడివోయ్... యే తీగ పూవును పాటల్ని ట్యూన్ మార్చి ఇందులో ఉపయోగించామనీ, మెలోడీకి ఎంతో స్కోప్ ఉన్న చిత్రమిదనీ అన్నారు. తననుంచి మంచి సంగీతాన్ని రాబట్టిని క్రెడిట్ రవియాదవ్ కు దక్కుతుందన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|